నాకు డబ్బులు ఇవ్వకపోతే ‘శేఖర్’ మూవీ ఆడదు

నాకు డబ్బులు ఇవ్వకపోతే ‘శేఖర్’ మూవీ ఆడదు

హైదరాబాద్: రేపటిలోగా తనకు రూ.65 లక్షలు ముట్టకపోతే... శేఖర్ మూవీ ప్రదర్శన నిలిచిపోతుందని ప్రముఖ ఫైనాన్షియర్ ఎ.పరంధామ రెడ్డి తేల్చి చెప్పారు. రాజశేఖర్ హీరోగా ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన శేఖర్ మూవీ ఈ నెల 20న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా నిర్మాణం కోసం జీవిత తన వద్ద నుంచి రూ.65 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలేదని ఆరోపిస్తూ ఫైనాన్షియర్ పరందామ రెడ్డి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఈ కేసును విచారించిన కోర్టు ఆదివారం (మే 22) సాయంత్రం నాలుగున్నర గంటల లోపు డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

లేని ఎడల శేఖర్ మూవీకి సంబంధించిన సర్వహక్కులను అటాచ్ మెంట్ చేయాల్సి ఉంటుందని కోర్టు నిర్ణయం తీసుకుంది. డబ్బు కట్టకపోతే... థియేటర్, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్... ఇలా ఎలాంటి ప్లాట్ ఫామ్స్ లో కూడా శేఖర్ సినిమాను ప్రదర్శించొద్దని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక వేళ కోర్టు ఆర్డర్లను పాటించకుండా శేఖర్ సినిమాను ప్రదర్శిస్తే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు అవుతుందని, సినిమాను నిలిపి వేయాల్సి వస్తుందని ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి మీడియాకు తెలియజేశారు. 

మరిన్ని వార్తల కోసం...

డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్

కోవై సరళ షాకింగ్ లుక్