
తిన్నాక చేయి కడగకుండా బద్ధకంతో సోఫాకో, బట్టలకో తుడిచేసి అమ్మతో తిట్లు తిన్న సందర్భాలు చాలానే ఉండి ఉంటాయి. అలాంటి వాళ్లకోసం లేస్ కంపెనీ ఒక యునిక్ ఫింగర్ వాషర్‌ని తీసుకొచ్చింది. దాంతో వేళ్లకు అంటిన నూనెను శుభ్రం చేసుకోవచ్చు. ఫింగర్ బౌల్‌లా ఉపయోగపడుతుందని చెప్తున్న ఈ మెషిన్ చూడ్డానికి బుడ్డి వాషింగ్ మెషిన్‌లా ఉంది. దీనికి ఫింగర్ వాషింగ్ మెషిన్ అని పేరుపెట్టారు. 15 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ మెషిన్ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. ఆన్, ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. మెషిన్ లోపల చిన్న గిన్నె , అందులో వేళ్లని శుభ్రం చేసేందుకు ఆల్కహాల్ సబ్‌స్టెన్స్ ఉంటుంది. వేళ్లను మెషిన్‌లో పెట్టి బటన్ ఆన్ చేయగానే, ఆల్కహాల్‌ని వేళ్లపై స్ప్రే చేసి, క్లీన్ చేస్తుంది. పాకెట్‌లో పట్టే ఈ మెషిన్ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కానీ, మరీ చేతులు కడుక్కోలేనంత బద్ధకం మంచిది కాదని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.