
హైదరాబాద్ హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలో కరోనా బాబా ప్రత్యక్షమయ్యాడు. మాయలు, మంత్రాలతో కరోనను నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.
హహీజ్ పేట్ హనీఫ్ కాలనీలో నివాసం ఉంటున్న ఇస్మాయిల్ బాబా కరోనా సోకిన బాధితులకు మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశాడు. సుమారు 70మంది స్థానికులకు మాయమాటలు చెప్పి కరోనా సోకిన ఒక్కో రోగి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు భారీ ఎత్తున దండుకున్నాడు.
తన కు అతీతశక్తులున్నాయని, వాటి ద్వారా కరోనా ను నయం చేస్తానంటూ శిష్యుల చేత ప్రచారం చేయించారు.జలుబు, దగ్గు ఉన్నా..అది కరోనానే అంటూ ప్రజల్ని మోసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా సోకిన బాధితులు ఎవరైనా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని, ఇలాంటి దొంగబాబాలు చేస్తున్న ప్రచారాల్ని నమ్మొద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు