తబ్లిగి జమాత్ నిర్వాహకులపై FIR నమోదు

తబ్లిగి జమాత్ నిర్వాహకులపై FIR నమోదు

దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్‌ తదితరులపై అంటువ్యాధుల చట్టం 1897  ప్రకారం FIR నమోదు చేసినట్టు  ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.ఎన్‌. శ్రీవాత్సవ తెలిపారు. అంతేకాకుండా మర్కాజ్‌కు హాజరైన 12 మంది విదేశీయులు సమాచారాన్ని రహస్యంగా ఉంచినందుకు  జామా మసీదు వజీరాబాద్‌ ఇమామ్‌పై కూడా కేసు నమోదు చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలంటూ ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాశారు.

మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన ఈ సమావేశానికి  భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న(మంగళవారం) ఒక్క రోజే 146 కొత్త కేసుల నమోదుతో భారత్‌లో కరోనా కేసులు 1397కు పెరిగాయి.

ఉలిక్కిపడ్డ గద్వాల్… రంగంలోకి దిగిన ఆఫీసర్లు

ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం

ఆ మహిళను చంపింది ప్రేమికుడే