చిక్కుడువాని పల్లెలో అగ్ని ప్రమాదం

చిక్కుడువాని పల్లెలో అగ్ని ప్రమాదం

ఇల్లంతకుంట వెలుగు: ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ మామిడి తోట సమీపంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు గాలిదుమారంతో ఒకదానికొకటి తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈ మంటలు పక్కనే ఉన్న మామిడి తోటలకు వ్యాపించడంతో మామిడి చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు కాలిపోయాయి.

విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ చింతమడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం, గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో మామిడి చెట్లు, పంట దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్ కానిస్టేబుల్ రాధారపు సురేష్, జీపీఓ రాజు, యువకులు ట్యాంకర్‌‌‌‌ను తీసుకొచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.ఈ ఘటనలో సుమారు నాలుగు టన్నుల మేర మామిడి పంట నష్టపోయినట్లు రైతు, సర్పంచ్ చింతమడక కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.