కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం

రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం  జైపూర్ లోని బస్సీ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, అగ్నమాపక సిబ్బంది.  ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. 

కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రకాష్ రాజ్‌పురోహిత్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిని వెంటనే జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.