చైనా మార్కెట్‌లోనే కరోనా ఫస్ట్​ కేసు

చైనా మార్కెట్‌లోనే కరోనా ఫస్ట్​ కేసు
  • చేపలమ్మే మహిళే బాధితురాలు

న్యూయార్క్: చైనాలోని వూహాన్​ హోల్​సేల్​ఫుడ్ మార్కెట్​లో చేపలు అమ్మే ఓ మహిళకే మొట్టమొదట కరోనా వచ్చిందని ఓ కొత్త స్టడీ తెలిపింది. కరోనా సోకిన ఆ మహిళ సెంట్రల్ చైనీస్ నగరంలోని హువానాన్ లైవ్ యానిమల్ మార్కెట్‌‌లో పనిచేసినట్లు  స్టడీ పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ గురువారం ఓ కథనం ప్రచురించింది. అరిజోనా యూనివర్సిటీకి చెందిన వోరోబే అనే ఎక్స్ పర్ట్.. ఇప్పటి వరకు వైరస్​ పుట్టుకపై వచ్చిన జర్నల్స్​తోపాటు, చైనీస్ న్యూస్ అవుట్‌‌లెట్‌‌లోని వీడియో ఇంటర్వ్యూలపై స్టడీ చేశాడు. హువానాన్ సీఫుడ్ హోల్‌‌సేల్ మార్కెట్‌‌కు, ఆసుపత్రిలో చేరిన రోగులకు గల సంబంధాలను విశ్లేషించాడు. మార్కెట్​లోనే వైరస్​ మొదటగా ప్రారంభమైందని వోరోబే తెలిపారు. వైరస్ ​పుట్టుక కనిపెట్టడానికి డబ్ల్యూహెచ్‌‌వో ఎంపిక చేసిన వారిలో ఓ సైంటిస్టు సహా చాలా మంది ఎక్స్​పర్ట్​లు​ వోరోబే స్టడీతో ఏకీభవించారు. అయితే వైరస్​ఎలా పుట్టిందనే పెద్ద ప్రశ్నకు జవాబు చెప్పేందుకు ఆధారాలు సరిపోవడంలేదన్నారు.