
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు గ్రౌండ్‌కే పరిమితమైన దేశీయ విమానాల సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన విమానం ఇవాళ(సోమవారం)ఉదయం పూణె విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమాన సర్వీసులను పునరుద్ధరించిన ప్రభుత్వం అందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకున్న వెంటనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. భౌతిక దూరాన్ని అమలు చేశారు. సిబ్బంది కూడా పూర్తిస్థాయి రక్షణ కిట్లు ధరించి విధులకు హాజరయ్యారు.