రామన్ పాడు ప్రాజెక్టును సందర్శించిన కమిషనర్

రామన్ పాడు ప్రాజెక్టును సందర్శించిన కమిషనర్

మదనాపురం, వెలుగు: మండలంలోని రామన్ పాడు ప్రాజెక్టును గురువారం స్టేట్​ ఫిషరీస్  కమిషనర్  గోపి, కలెక్టర్  తేజస్​ నందలాల్  పవార్ సందర్శించారు. జలాశయం వద్ద ఆక్వా హబ్  ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టుకు సంబంధించిన భూమి వివరాలతో పాట జలాశయం నీటి నిలువ సామర్థ్యం, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా హబ్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని తెలిపారు.

జలాశయం రోడ్డు పూర్తిగా చెడిపోయిందని, రిపేర్లు చేయించేందుకు ఫండ్స్​శాంక్షన్​ చేయాలని గ్రామస్తులు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఫిషరీస్​ ఏడీ మురళీధర్, రహమాన్, ఇరిగేషన్​ ఇంజినీర్లు వెంకటరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రనిల్ రెడ్డి, తహసీల్దార్​ అబ్రహం లింకన్  పాల్గొన్నారు.