2050 నాటికి చేపలు ఉండవు.. ఎవరన్నారంటే

2050 నాటికి చేపలు ఉండవు.. ఎవరన్నారంటే

జనాలు తమ గురించి.. తమ కుటుంబం గురించే ఆలోచిస్తుంటారు. ఏ జీవి ఏమయిపోతే మాకేంటిలే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్.   ప్లాస్టిక్ ను సముద్రంలో పడేసేవారు సముద్ర జీవుల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇలాగే  2050లో చేపలు అంతమవుతాయని  . . సముద్రంలో భారీ ప్లాస్టిక్ ద్వీపాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.  

2040 నాటికి విధ్వసం

ప్రపంచంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం విధ్వంసానికి దారితీస్తుందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.   ప్రపంచ  పర్యావరణంలో జరుగుతున్న మార్పులను ఆయన ప్రపంచ దృష్టికి తెచ్చారు.  భూమ్మీద ప్లాస్టిక్ వాడుతున్న తీరును బట్టి 2040 నాటికి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన వివరించారు.  ఇప్పుడు ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా కేరీ బ్యాగ్స్ పై ఆధారపడుతున్నాం.  వాటిని తీసుకొచ్చి చెత్తతో నింపి బయట పడేస్తున్నాం.  అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది.  ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతిని కాలుష్యం పెరిగిపోతుందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్ అన్నారు. 

పసిఫిక్ మహా సముద్రంలో ప్లాస్టిక్ కుప్పలు

కొంతమంది ప్లాస్టిక్ ను వాడిన తరువాత సముద్రంలో విసిరేస్తున్నారని తాన్యా తెలిపారు.  2040 నాటికి సముద్రంలో ప్లాస్టిక్  పెద్ద ద్వీపంగా ఏర్పడుతుందన్నారు.  ఇప్పటికే పసిఫిక్ మహా సముద్రంలో ప్లాస్టిక్ కుప్పలున్నాయన్నారు.  చాలా దేశాల్లో చెత్త పదార్దాలను సముద్రాల్లో  వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ప్లాస్టిక్ ఎంత కాలమైనా కరగదు. అలాంటి పరిస్థితుల్లో సముద్ర జీవులు ప్లాస్టిక్ ను తిని అనేక వ్యాధులతో మరణిస్తున్నాయన్నారు. 
 

2050 నాటికి చేపలు అంతం ఆస్ట్రేలియా మంత్రి

2040 నాటికి ప్లాస్టిక్ వాడకం మూడు రెట్లు పెరుగుతుందని తాన్యా చెప్పారు. దీని ఫలితంగా  పదేళ్ల తర్వాత ( 2050 నాటికి)   వ్యాధులతో కూడిన చేపలు వస్తాయన్నారు. ఇది  పర్యావరణంపై   ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 6 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ప్లాస్టిక్ చెత్త ఉంది. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందన్నారు.  సముద్ర జీవులు  ప్లాస్టిక్ ను  తిన్న తర్వాత అనారోగ్యానికి గురయి చనిపోతాయి . ప్లాస్టిక్‌తో పాటు, వీటిలో సీసా మూతలు, దుస్తులు ముక్కలు మరియు పెన్ లీడ్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో   పర్యావరణం దృష్ట్యా ప్లాస్టిక్ వాడకాన్ని  అరికట్టాల్సిన బాధ్యత ప్రపంపవ్యాప్తంగా ఉందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్ తెలిపారు.

అప్రమత్తం కాకపోతే భవిష్యత్తు ప్రమాదకరం 

భారత ప్రభుత్వం అనేక సార్లు ప్లాస్టిక్‌ను నిషేధించింది. నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ జనాలు  ప్లాస్టిక్ వాడకాన్ని కొద్దిరోజులు వాడటం లేదు.  ఆ తరువాత  మళ్లీ ప్లాస్టిక్ ను యధాతథంగా వాడుతున్నారు. దీంతో మళ్లీ కాలుష్యం పెరుగుతుంది. . ప్రపంచంలోని అన్ని దేశాలు  ప్లాస్టిక్ ను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.  ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్ దాని భయంకరమైన పరిణామాల గురించి ప్రపంచానికి చెప్పారు. ప్రపంచం వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.