హైదరాబాద్ –విజయవాడ జాతీయ పైరహదారిపై ఐదు కార్లు ఢీ 

హైదరాబాద్ –విజయవాడ జాతీయ పైరహదారిపై ఐదు కార్లు ఢీ 

చౌటుప్పల్, వెలుగు : హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారిపై ఐదు కార్లు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామం వద్ద శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు రెడ్డిబావి గ్రామం వద్దకు రాగానే సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న నాలుగు కార్లు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి.

 ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధకుమార్ తెలిపారు.