శత్రువులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే.. ఏదో ప్రళయం వచ్చినట్టే.. రెండు వ్యతిరేక వర్గాలు కలిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంభరాశిలో ఐదు శక్తివంతమైన గ్రహాలు కలిసిసంచరిస్తున్నాయి, ఇలా ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు కలిసి సంచరించడాన్ని స్టెల్లియం అంటారు. ప్రస్తుతం కుంభరాశిలో ఏర్పడిన స్టెల్లియం వలన ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
కుంభరాశిలో ఐదు శక్తివంతమైన గ్రహాలు కలిశాయి. శుక్రుడు, బుధుడు, సూర్యుడు, రాహువు , కుజుడు ఈ ఐదు గ్రహాలు శని గ్రహం పాలించే కుంభరాశిలో సంచరిస్తున్నాయి.
బుధుడు: కమ్యూనికేషన్, తెలివితేటలు, వాక్చాతుర్యం, జ్ఞానాన్ని సూచిస్తాయి.
రాహువు: చంచల స్వభావం , తెలియని ఆందోళన భ్రమ, కర్మ ఫలితాలను సూచిస్తుంది.
కుజుడు: ఈ గ్రహం శక్తి దైర్యం, నిర్భయత,శక్తి, దూకుడును సూచిస్తుంది.
శుక్రుడు: ప్రేమ, అందం, సామరస్యం, సంపద , విలాసవంతమైన జీవితం మొదలగునవి సూచిస్తాయి.
సూర్యుడు: చాలా శక్తివంతం. అధికారాన్ని సూచిస్తుంది. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టల విషయంలో సూర్య గ్రహం కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ఐదు గ్రహాలు జీవితంలో ఒక పెద్ద మార్పును తెస్తాయి ఎందుకంటే ఇది ఒక చక్రం పూర్తి అయి మరొక కర్మ చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది. వాటి శక్తివంతమైన శక్తులు ఆధ్యాత్మిక అవగాహనతో కలిసిపోయి మరింత బలంగా మారతాయి మరియు ఇది గొప్ప ప్రపంచ మార్పులను తెస్తుంది.
రాహువు & సూర్యుడు:ఈ రెండు గ్రహాలు చాలా శక్తి వంతమైనవి. ఆధిపత్యధోరణిని కలిగి ఉంటారు. ఈ రెండు గ్రహాల విషయంలో ఒకరు అవునంటే.. మరొకరు కాదనే విధంగా ఉంటుంది. అందువలన ఈ రెండు గ్రహాలు కలిసి ఒకేచోట ఉండటం అంత శ్రేయస్కరం కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శుక్రుడు & సూర్యుడు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రెండు గ్రహాలు శత్రువులు. ఎప్పుడు వాదించుకొనే ధోరణి కలిగి ఉంటారు. కావున ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి వారు అధికంగా మాట్లాడకపోవడమే మంచిది.
రాహువు & కుజుడు:ఈ రెండు కలిసినప్పుడు అంగారక యోగం ఏర్పడుతుంది. ఇది నాశనానికి ప్రతీక అని చెబుతన్నారు.
కుంభ రాశి లో స్టెల్లియం.. ఆరాశి వారికి ఎలా ఉంటుందంటే..
- 1. వీరికి శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది
- 2. కోప సమస్యలు ఉంటాయి.
- 3. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
- 4. ప్రతి విషయంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు
