దుండిగల్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

దుండిగల్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఫ్లైట్ కాడేట్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్ హన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ శిక్షణ పూర్తి చేసుకున్న 164మంది గ్రాడ్యుయేట్లకు షేక్ అబ్దుల్ హన్నం శుభాకాంక్షలు తెలిపారు. 

ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను షేక్ అబ్దుల్ హన్నం తిలకించారు. తేజస్, సూర్యకిరణ్, రాఫెల్, సరస్ తదితర యుద్ధ విమానాలు, పారాచుట్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథి షేక్ అబ్దుల్ హన్నం భారత్ తమకు మిత్ర దేశమని తెలిపారు. భారత్ కు, బంగ్లాదేశ్ కు మధ్య సత్సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. 1971లో భారత్ నుంచి విడిపోయినా భారత్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని వివరించారు.