అదిరిపోయే ఆఫర్లతో ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్’

అదిరిపోయే ఆఫర్లతో ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్’

మొబైల్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ పేరుతో సరికొత్త ఆఫర్లతో మరోసారి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మరియు మరెన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ కార్డుతో రూ. 4,999లకు పైగా షాపింగ్ చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను (రూ. 1,250 వరకు) కూడా కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ ఆఫర్స్ డిసెంబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్‌లో కొన్ని బెస్ట్ డీల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…
రెడ్ మీ నోట్ 7 ప్రో
షియోమీ కొత్తగా తీసుకొచ్చిన సరికొత్త మోడల్ రెడ్ మీ నోట్ 7 ప్రో. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో రూ. 15, 999 విలువ గల ఈ ఫోన్‌ను ప్రస్తుత ఆఫర్‌లో రూ. 10, 999లకే అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. పాత ఫోన్ ఎక్సెంజ్‌ చేస్తే రూ. 10, 800 వరకు ధర తగ్గుతుంది.

రియల్ మీ 5 ప్రో
అత్యంత ఆదరణ కలిగిన ఈ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్ ఎటువంటి రాయితీ కల్పించలేదు. రూ. 11,999 విలువ గల ఈ ఫోన్‌ని ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా పాత ఫోన్ ఎక్సెంజ్‌ చేస్తే రూ. 10, 800 వరకు ధర తగ్గుతుంది. క్వాల్ కామ్ డ్రాగన్ 712 చిప్‌సెట్, 4జీబీ ర్యామ్, మరియు క్వాడ్ రియర్ కెమెరా దీని ప్రత్యేకత.

వివో జెడ్1 ప్రో
ఎన్నో ఫోటో ఫీచర్లు కలిగిన వివో జెడ్1 ప్రోను రూ. 12, 990లకే అందిస్తోంది. దీని అసలు ధర రూ. 15, 990. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ గల ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. పాత ఫోన్ ఎక్సెంజ్‌ చేస్తే రూ. 10, 800 వరకు ధర తగ్గుతుంది. కొన్ని సెలెక్టడ్ క్రెడిట్ కార్డలపై ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఈఎమ్ఐలో కూడా లభిస్తుంది.

రెడ్ మీ కే20
షియోమీలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న కొత్త ఫోన్ ఇది. దీని అసలు ధర 22, 999 నుంచి రూ. 19, 999కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా లభిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9
సామ్‌సంగ్ నుంచి విడుదలయిన సరికొత్త ఫోన్. దీని అసలు ధర రూ. 62,500. కాగా, బిగ్ షాపింగ్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ దీని ధరను రూ. 27, 999గా నిర్ణయించింది. ఇది సామ్‌సంగ్ ఎక్సినోస్ 9810 చిప్‌సెట్, 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా మరియు 4 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది.

ఆపిల్ ఐ ప్యాడ్
సిక్స్త్ జనరేషన్ ఆపిల్ ఐ ప్యాడ్ రూ. 24,999 కు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 28,000. ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 9.7 అంగుళాల డిస్ ప్లే, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా దీని ప్రత్యేకతలు. ఇది ఆపిల్ పెన్సిల్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

వీయూ అల్ట్రా టీవీ
స్మార్ట్ టీవీల ధరలు మెల్లగా అందుబాటులోకి వస్తున్నాయి. వీయూ కంపెనీకి చెందిన రూ. 27,000 విలువ గల 40 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం రూ. 15, 999లకే అందిస్తుంది. మీ పాత టీవీని ఎక్సెంజ్ చేస్తే దాదాపు రూ. 6, 000 వరకు ధర తగ్గుతుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు ఇతర స్ట్రీమింగ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది.