రూ.20,095 ల స్మార్ట్ ఫోన్ రూ.7,999లకే

రూ.20,095 ల స్మార్ట్ ఫోన్ రూ.7,999లకే

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్‌ నిర్వహిస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనబోయే వారికి ఈ సేల్ లో బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. ఆఫర్స్ లో భాగంగా నోకియా, హానర్, వివో, ఒప్పొ, రియల్‌మి, షావోమి ఫోన్ లపై అదిరిపోయే డీల్స్ ను అందిస్తోంది.

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్ అందుబాటులో ఉంచింది ఫ్లిప్ కార్ట్. ఏకంగా 60 శాతం ఈ ఫోన్ పై ధరను తగ్గించింది. రూ.20,095 గా ఉన్న అసలు ధరను ఇప్పుడు రూ.7,999గా తగ్గించింది.

 నోకియా 6.1 ఫోన్‌లో హైలైట్స్

  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర
  • 5.5 అంగుళాల స్క్రీన్ (ఫుల్ హెచ్ డి డిస్ ప్లే)
  • 16 ఎంపీ రియర్ కెమెరా
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్.
హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్ పై కూడా ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్ ను ఇస్తోంది. రూ.19,999 ల హానర్ ఫోన్ ను కేవలం రూ.8,999కే అందుబాటులో  ఉంచింది.

హానర్ 9ఐ  హైలైట్స్

  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ
  • 5.9 అంగుళాల స్క్రీన్
  •  డ్యూయెల్ రియర్ కెమెరా (16 ఎంపీ+2 ఎంపీ)
  •  డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ)
  • 3340 ఎంఏహెచ్ బ్యాటరీ
  • కిరిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేయాలనువారికి మరో ఆఫర్ కూడా ఉంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా ఈ ఫోన్స్ ను కొన్నట్లయతే  5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి కూడా ఈ 5 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.

ఒకవేళ ఎక్స్చేంజ్ రూపంలో ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే వీటి ధర మరింత తక్కువగా ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.