ఎండలు, నీటి విడుదల కారణంగా మిడ్‌మానేరు అడుగంటడంతో చీర్లవంచ, చింతల్‌ఠాణా, నీలోజిపల్లి, సంకెపల్లి, అనుపురం, కొడిముంజ తదితర పదికిపైగా ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. ప్రాజెక్టు కారణంగా ఆయా గ్రామాల నుంచి నిర్వాసితులై వెళ్లిన వాళ్లంతా ఇప్పుడు తిరిగి వచ్చి గ్రామాల్లో తిరుగుతూ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు.
కొందరు తమ ఇండ్లు, వీధుల్లో తిరుగుతూ సెల్ఫీలు దిగుతుండగా, ఇంకొందరు తమ ఇండ్లను చూసి నాటి సంగతులు యాది చేసుకొని కంటతడి పెడ్తున్నారు. గురువారం కొంకటి యశోద, తన కూతురు వందనతో కలిసి మిడ్‌మానేరులో తేలిన నీలోజిపల్లికి వెళ్లింది. అక్కడ తమ ఇంటిని చూడగానే ఒక్కసారిగా బోరుమంది. ‘ఎట్ల బతికినం బిడ్డా.. ఇప్పుడు ఎట్లయిపోతిమి..’ అంటూ రోదించింది.
- వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్