
- గంటకు 20 కి.మీ మించని వెహికల్ స్పీడ్
- రద్దీతో వాహనదారులకు ఇబ్బందులు
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌లో ఐటీ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు ట్రాఫిక్‌లో నరకం చూస్తున్నారు. ఐటీ కారిడార్లోఉదయం, సాయంత్రం వేళల్లో కార్లు, బైక్‌ల వేగం 10 నుంచి 30 స్పీడ్ దాటడం లేదు. 10 కిలోమీటర్ల దూరానికి గంటకు పైనే టైమ్ పడుతోంది. దీంతో ఈ ట్రాఫిక్‌లో ఆఫీసుకు వెళ్లడం కంటే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవడమే బెస్ట్అని చాలా మంది భావిస్తున్నారు. ట్రాఫిక్‌రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతోందే తప్ప తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం నరకం మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో, ఇతర జాబ్ లు చేసేవారు సిటీ నలుమూలల నుంచి క్యాబ్‌లు, బైక్‌లు, సొంత కార్లు, పబ్లిక్ సర్వీసులలో ఐటీ కారిడార్‌కు చేరుకుంటారు.
దీంతో ఈ రూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతంలోని రోడ్లు మొత్తం వెహికల్స్‌తో నిండిపోయి ఉంటాయి. బంపర్ టూ బంపర్అన్న విధంగా వెహికల్స్ మూవ్‌అవుతూ ఉంటాయి. ఇంతటి తీవ్ర ట్రాఫిక్ కారణంగా ఐటీ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. హైటెక్‌సిటీ నుంచి జేఎన్టీయూ మీదుగా ప్రగతినగర్‌కు 12 కిలోమీటర్ల దూరం ఉండగా.. రద్దీ టైమ్‌లో ఈ రూట్లో ప్రయాణానికి దాదాపు గంట సమయం పడుతోంది. గచ్చిబౌలి నుంచి షేక్‌పేటకు 6.2 కి.మీ. దూరం ఉండగా.. ఈ రూట్లో ఉదయం, సాయంత్రం ప్రయాణానికి అరగంట పడుతోంది. వెహికల్స్ మొత్తం బారులు తీరుతున్నాయి. గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్చౌరస్తాకు 11 కిలోమీటర్ల దూరం ఉండగా.. మామూలుగా అయితే 20 నిమిషాలు పట్టే ఈ ప్రయాణానికి రద్దీ కారణంగా ముప్పావుగంట పడుతోంది. భారీ ట్రాఫిక్‌తో టైంకు ఆఫీసులకు చేరుకోలేకపోతున్నామని ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్‌ను తట్టుకోలేక వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా
మా ఇంటి నుంచి మైండ్‌స్పేస్‌లోని ఆఫీస్‌కు 30 కి.మీలు. ప్రతిరోజు ఉదయం ఆఫీస్‌కు వెళ్లడానికి గంట 45 నిమిషాలు, సాయంత్రం అఫీస్ నుంచి ఇంటికి రావడానికి రెండున్నర గంటల టైమ్ పడుతోంది. ట్రాఫిక్‌లో బైక్ స్పీడ్ 10 నుండి 20కి మించి వెళ్లడం లేదు. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు బైక్ డ్రైవింగ్‌తో బ్యాక్ పెయిన్వస్తోంది. దీంతో ఆఫీస్‌కు వెళ్లే బదులు ఇంట్లో ఉండి వర్క్‌ఫ్రం హోం చేస్తున్నా.
– విజయ్ ఐటీ ఎంప్లాయ్, బోడుప్పల్
ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు కట్టినా ట్రాఫిక్ తగ్గలే
ఐటీ కారిడార్‌లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వల్ల రద్దీ తగ్గిందని నేతలు చెబుతున్నారు. కానీ ఎక్కడా ట్రాఫిక్ తగ్గలేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. హైటెక్‌సిటీ నుంచి కూకట్పల్లి వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉండాల్సి వస్తోంది.
– లక్ష్మణ్, ప్రైవేటు ఎంప్లాయ్, కూకట్పల్లి