పెరుగుతున్న ట్రాఫిక్​తో తరచూ ఇబ్బందులు

పెరుగుతున్న ట్రాఫిక్​తో తరచూ ఇబ్బందులు

నియంత్రణ కు కనిపించని టాస్క్​ ఫోర్స్​

కరీంనగర్ టౌన్,వెలుగు:    సిటీలో ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురవుతున్నాయి. చాలామంది వాటిని ఆక్రమించుకొని దుకాణాలు పెట్టుకున్నారు. దీంతో నడిచేందుకు జాగ లేక జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీ అంతటా ఇదే పరిస్థితి ఉన్నా  అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

యాక్సిడెంట్లు అయితున్నయ్​.. 

ఫుట్​పాత్​ల ఆక్రమణల వల్ల స్థానికులు రోడ్లపైనే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ట్రాఫిక్​ పెరుగుతోంది. తరచూ ప్రమదాలూ  జరుగుతున్నాయి.   కిందటి ఏడాది  జరిగిన ఓ ప్రమాదం లో నలుగురు మృతి చెందారు. అప్పటి కప్పుడు అధికారులు స్పందించి ఫుట్​పాత్​లపై వ్యాపారాలను క్లియర్​ చేశారు.  వారం రోజుల పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు హడావుడి చేసి, తర్వాత లైట్​ తీసుకున్నారు. 

కనబడని టాస్క్​ ఫోర్స్..  

రోడ్లపై వ్యాపారాలు చేసే వారితో పాటు,  ఫుట్ పాత్ ఆక్రమణలను అరికట్టేందుకు అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో  టాస్క్ ఫోర్స్  టీమ్​ను ఏర్పాటు చేశారు.  పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్  అధికారులు ఈ టీమ్​లో ఉంటారు.  తరచూ తనిఖీలు చేసి,  రోడ్లపై రూల్స్​ అతిక్రమించిన వారికి  జరిమానాలు విధించారు. అంతేకాకుండా చిరువ్యాపారుల్లో కొంతమందిని  ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించి,మిగతా వారికి త్వరలో శాశ్వతంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు తరలిస్తామని హామీ ఇచ్చారు.  రోడ్లపై విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ పని పది రోజులే సాగింది.  ముఖ్యంగా కమాన్, టవర్ సర్కిల్, సివిల్ హాస్పిటల్,శివ థియేటర్ నుంచి యూనివర్సిటీ వరకు, మంకమ్మతోట, రాంనగర్ టీవీ టవర్ ,  కోర్టు నుంచి శివథియేటర్  వెళ్లే  ఏరియాల్లో  వీధులన్నీ నిండిపోతున్నాయి.  అధికారులు, నాయకులు స్పందించి చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం లేదా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ ఏర్పాట్లు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.