అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు

అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు

పెంబి, వెలుగు: అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని పెంబి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ అన్నారు. అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణ, అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై బుధవారం పెంబి మండలంలోని తాటిగూడ, పుల్గపండ్రి, రాగిదుబ్బ నాలా, కొసగుట్ట  రాయిగూడెంలలో  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద్భరంగా అయన మాట్లాడుతూ.. వన్య ప్రాణులను వేటాడటం, అడవిలో నిప్పు పెట్టడం నేరమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ  కార్యక్రమంలో  సర్పంచ్ రాజు, ఎఫ్ఎస్ ఓ రవీందర్, లచ్చన్న, రాజు, మనోహర్, శ్రీనివాస్, రాంచందర్, శ్రీనివాస్, మహేందర్, సంతోష్, నాగభూషణ్​ పాల్గొన్నారు.