సోనియాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

సోనియాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై వారిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే జాతీయ రాజకీయాలపై కూడా చర్చించినట్లు ఆ పార్టీ మీడియా వర్గాలు తెలిపాయి.

ఇక... తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి... తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఏమాత్రం పట్టంచుకోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. అందుకోసం సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. కానీ 2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి... ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఈ క్రమంలోనే తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కొంత కాలంగా కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే... తాజాగా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే ఆయనను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వార్తల కోసం...

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ

జకార్తా బయలుదేరిన పురుషుల హాకీ టీం

కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు