APPSC చైర్మ‌న్‌గా గౌతమ్ స‌వాంగ్‌

 APPSC చైర్మ‌న్‌గా గౌతమ్ స‌వాంగ్‌

నిన్న‌టిదాకా నేర‌స్థుల‌ను క‌ట్టడి చేసే పోలీసు ఉద్యోగంలో కొన‌సాగిన  ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఇవాళ(గురువారం) ఖాకీ డ్రెస్ వ‌దిలేశారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (APPSC) చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేపట్టారు.ఐపీఎస్ అధికారిగా ఇంకా కొన్ని నెల‌ల పాటు స‌ర్వీసు ఉన్న‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ ఆదేశాలతో ఆ స‌ర్వీసును వ‌దిలేసుకున్న స‌వాంగ్..APPSC చైర్మ‌న్ ప‌ద‌విని చేప‌ట్టారు. ఈ మేర‌కు గురువారం విజ‌య‌వాడ‌లోని ఏపీపీఎస్సీ కార్యాల‌యంలో ఆ సంస్థ చైర్మ‌న్‌గా స‌వాంగ్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీకరించారు. ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా ప్ర‌మాణం చేసిన స‌వాంగ్‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

మరిన్ని వార్తల కోసం...

రైతులు చస్తున్నా కేసీఆర్కు పట్టించుకునే తీరికలేదు