
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డీన్ జోన్స్ (59) గుండెపోటుతో ముంబైలో చనిపోయారు. ఐపీఎల్‌కు సంబంధించి బ్రాడ్‌కాస్టర్లతో కమిట్‌మెంట్స్ ఉండటంతో జోన్స్ ముంబైలో ఉన్నారు. హోటల్ గదిలో ఉన్న జోన్స్‌కు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హఠాత్తుగా తీవ్ర గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన కన్నుమూశారు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ స్పందించింది. జోన్స్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన స్టార్ సంస్థ.. అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఆస్ట్రేలియన్ హై కమిషన్‌తో కాంటాక్ట్ ఉన్నట్లు పేర్కొంది. ఆసీస్ తరఫున 164 వన్డేలు ఆడిన జోన్స్.. 52 టెస్టుల్లో కంగారూలకు ప్రాతినిధ్యం వహించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో 11 సెంచరీలు కొట్టిన జోన్స్.. 46.55 యావరేజ్‌తో 3,631 రన్స్ చేశాడు. వన్డేల్లో 7 సెంచరీలు బాదాడు. వన్డేల్లో 44.61 యావరేజ్‌తో 6,068 రన్స్ చేశాడు.