బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు

బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు

సూపర్ మోడల్, మాజీ మిస్ ఇండియా (ప్రపంచ) నటాషా సూరికి ఆన్‌లైన్ వేదికగా వేధింపులు ఎదురయ్యాయి. కొన్ని అసభ్యకర చిత్రాలకు ఆమె పేరును ట్యాగ్ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. ఫ్లిన్ రెమెడియోస్ అనే వ్యక్తి ఇండియాస్కూప్స్.కామ్ మరియు ఇండియాస్పీక్స్.లైవ్ మరియు మరికొన్ని ఇతర ఆన్‌లైన్ సైట్లలో కొంతమంది మహిళల అసభ్యకర చిత్రాలను పోస్టు చేస్తూ.. వాటి కింద నటాషా సూరి అని ట్యాగ్ చేస్తున్నాడు. ఆమెపై నకిలీ వార్తా కథనాలు రాసి ప్రచారం చేసేవాడు. బాత్రూంలో నగ్నంగా ఉన్న కొంతమంది అమ్మాయిల ముఖాలను బ్లర్ చేసి, వాటిని నటాషా సూరి పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయి.. చివరకు ఆమె వరకూ చేరాయి. ఇదంతా నవంబర్ 2019లో జరిగింది. దాంతో నటాషా, తన లాయర్ మాధవ్‌తో కలిసి బుధవారం ముంబైలోని దాదర్ పోలీస్ స్టేషన్‌లో రెమెడియోస్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

‘నన్ను బిగ్ బాస్ 13 పోటీదారు సిధార్థ్ శుక్లా వేధింపులకు గురిచేసినట్లు నేను ఆరోపించానని రెమెడియోస్ తన పోర్టల్స్‌లో ఒక కథనాన్ని ప్రచురించాడు. దాంతో మరో కొత్త వివాదం రేకెత్తింది. నా జీవితంలో నేను సిద్దార్థ్ శుక్లాను ఎప్పుడూ కలవలేదు. నాకు అసలు అతను ఎవరో కూడా తెలియదు. రెమెడియోస్ కొన్ని నకిలీ ట్విట్టర్ ఖాతాలను ప్రారంభించి, వాటిలో భయానక వార్తలను రాయడం, బాత్రూమ్ ఫొటోలు, తలలు లేని పోర్న్ చిత్రాలు మొదలైనవి తన పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి వాటికి నటాషా సూరి అని ట్యాగ్ చేసేవాడు. దాంతో గూగుల్‌లో నా పేరు టైపు చేస్తే.. అతను అప్‌లోడ్ చేసిన ఫొటోలన్ని కనిపిస్తున్నాయి. నేను రెమెడియోస్‌పై డిసెంబర్ 24న బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్‌లో ఫిర్యాదు చేశాను. అప్పటినుంచి పోలీసులు అతనిపై దర్యాప్తు చేసి బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రెమెడియోస్ వల్ల నాతో పాటు చాలామందికి ప్రమాదముందని పోలీసులు గ్రహించారు. అందుకే అతనిపై కేసు నమోదు చేశారు’ అని మోడల్ నటాషా సూరి అన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా పోలీసుల గౌరవం పెరుగుతుందని నటాషా అన్నారు.

నటాషా సూరి 2006లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో టాప్ 10లో నిలిచింది. నటాషా 2016లో మలయాళ చిత్రం “కింగ్ లయర్”తో సినీరంగ ప్రవేశం చేసింది. అంతేకాకుండా ‘ఇన్సైడ్ ఎడ్జ్’ తో సహా మరికొన్ని వెబ్-సిరీస్‌లలో కూడా నటించింది.

For More News..

మరో ఏడాదిలో ఏపీ సీఎంగా వైఎస్ భారతి!

‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2019’గా రోహిత్ శర్మ