కాంగ్రెస్​లోకి జితేందర్ రెడ్డి

కాంగ్రెస్​లోకి జితేందర్ రెడ్డి
  • ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా నియామకం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చే శారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ దీప్ దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జితేందర్ రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాగా జితేందర్ రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (స్పోర్ట్స్ అఫైర్స్)గా నియమిస్తూ, రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పిస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

బీజేపీలో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను ఆ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించటంతో జితేందర్​ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యం లో గురువారం జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి రావాలని  రేవంత్ ఆహ్వానించారు. జితేందర్​రెడ్డి చేరిక కార్యక్రమంలో మహబూబ్​నగర్ కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీహరి ముది రాజ్, పర్ణిక రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. కాగా, జితేందర్ రెడ్డి రిజైన్​ లెటర్​ను ఆ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు, హోంమంత్రి అమిత్ షా, పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డికి పంపారు.