టీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే

హన్మకొండ జిల్లా : టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మరో మాజీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లనున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. -తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్ లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు.

సమైక్య వాది అయిన ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి చేశారని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి చెప్పారు. -VRAల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. -మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొలుగూరి భిక్షపతి అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు.