పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్‌

పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్‌

పంజాబ్ లో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. పంజాబ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్ జాఖర్‌ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 

పంజాబ్‌లో కొంతమంది కాంగ్రెస్‌ నేతలు తనపై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడంతో పార్టీ క్రమశిక్షణా కమిటీ తనపై చర్యలు తీసుకున్నందుకు చాలా బాధపడ్డానని సునీల్ జాఖర్ చెప్పారు. భజనపరులను దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో రాహుల్ గాంధీ తెలుసుకోవాలంటూ ఈ సందర్బంగా సెటైర్ వేశారు. 

కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ పై విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా చరణ్ జీత్ సింగ్ అంత బలవంతుడేమీ కాదన్నారు. కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోనీపైనా విమర్శలు చేశారు. పంజాబ్ లో హిందూ ముఖ్యమంత్రి ఉండటం వల్ల కలిగే పరిణామాల గురించి అంబికా సోనీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అంబికా సోనీ కూడా ఓ కారణమని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తానెప్పుడు రాజకీయాలను ఉపయోగించుకోలేదన్నారు. పంజాబ్​ కాంగ్రెస్​ నాయకులు కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించిన నేపథ్యంలో జాఖర్ ను పదవుల నుంచి తొలగించింది కాంగ్రెస్ అధిష్ఠానం.

ఇక అంతుకు ముందు ‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్‌ లక్‌. అండ్‌ గుడ్‌బై కాంగ్రెస్‌’ అని ఫేస్‌బుక్‌ లైవ్‌లో సునీల్ జాఖర్ ప్రకటించారు. చింతన్‌ శిబిర్‌కు బదులు కాంగ్రెస్‌ ‘చింతా’ శిబిర్‌ నిర్వహించాలన్నారు. 

 

 

మరిన్ని వార్తల కోసం..

సీఎం దత్తత గ్రామంలోనూ ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

దిశా ఎన్‌‌కౌంటర్‌‌పై సుప్రీంకోర్టు విచారణ.. ప్రకటనపై ఉత్కంఠ