
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జడ్చర్ల మండలం, నరులబాద్ దగ్గర లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో నరేష్(20) , శంకర్(38), జ్యోతి(26), మేఘన(1) లు మృతి చెందారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.