ఎకరానికి పైగా విరాళమిచ్చిన నలుగురు వ్యక్తులు

ఎకరానికి పైగా విరాళమిచ్చిన నలుగురు వ్యక్తులు
  • మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పోఖారి గ్రామస్తుల గాథ
  • రూ.39 లక్షల డొనేషన్ల సేకరణ
  • ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని బడి కట్టిస్తున్నరు

ఔరంగాబాద్: ‘మా ఊరి నుంచి ఒక్కరు కూడా ఆఫీసర్ కాలే’ అని బాధపడ్డరు.. ‘మా పిల్లల్ని ఆఫీసర్లను చెయ్యాలె’ మనసులో గట్టిగ అనుకున్నరు.. అనుకుంటే సరిపోతదా? స్కూల్ సక్కగ లేదు. ఎప్పుడు కూలుతదో తెల్వది.. ‘మళ్ల ఏంజేయాలె..’ అని సోచాయించిన్రు.. ప్రభుత్వాన్ని సాయం కోసం అడగలేదు.. ఎవరో వస్తారని ఎదురుచూడనూ లేదు.. ఎట్లయినా కష్టపడి తామే కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టాలని డిసైడ్ అయిన్రు.. కానీ స్థలం కావాలె, పైసలు కావాలె.. ఎట్ల? మధ్యలో కరోనా గడ్డుకాలం వచ్చింది.. చివరికి ఏమైంది? మీరే చదవండి!

నలుగురితో మొదలై..

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పోఖారి గ్రామం.. అంతా కలిపితే ఓ 1,300 మంది ఉంటారు. వారిలో ఎక్కువ మంది రైతులు, కూలీలు. 135 మంది దాకా చదువుకునే పిల్లలు ఉన్నారు. ఊర్లో నాలుగు క్లాస్ రూమ్స్ ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. వాటిలో రెండు గదులు పాడైపోయాయి. వానాకాలం వస్తే ఎటువైపు గోడ కూలుతుందోనని భయపడే పరిస్థితి. వెంటనే రిపేర్లు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ సరిపోలే. అదీకాక స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్థలం సరిపోవడం లేదు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. కొత్త బిల్డింగ్ కట్టాలని ఊరోళ్లు భావించారు. ముందుగా గ్రామంలోని నలుగురు వ్యక్తులు ముందుకు వచ్చారు. ఎకరానికి పైగా భూమిని విరాళంగా ఇచ్చారు. తర్వాత ఊర్లో విరాళాలు సేకరిస్తే.. రూ.18 లక్షలు జమయ్యాయి. ఇదంతా 2018 నాటి సంగతి. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించి, అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పైసలు సరిపోవు. ఇంకిన్ని పైసలు కావాలి. మరోవైపు మట్టి సమస్య. గ్రామంలోని మన్ను నల్లగా ఉంటుంది. దీంతో నిర్మాణ పనులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

కరోనాతో అడ్డంకులు

ఉన్న డబ్బుతోనే.. ఏడో తరగతి దాకా పిల్లలు చదువుకోవడానికి వీలుగా, ఆరు క్లాస్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణ పనులను మొదలుపెట్టారు గ్రామస్తులు. కానీ 2020లో కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. స్కూల్ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే దీన్ని అవకాశంగా మలుచుకున్న గ్రామస్తులు విరాళాల సేకరణపై దృష్టి పెట్టారు. దీంతో డొనేషన్లు రూ.39 లక్షలకు పెరిగాయి. ఈ రిపబ్లిక్ డేకి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి.. జెండా ఎగురవేయాలని భావించారు. కానీ ఫ్లోర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికల్లా స్కూల్ ను సిద్ధం చేయాలని గ్రామస్తులు భావిస్తున్నారు.

ఇక భయం లేదు

‘‘భయం మధ్య మా పిల్లలు చదువుకున్నారు. వానొస్తే.. క్లాసులకు వెళ్లకుండానే ఇండ్లకు వచ్చే వాళ్లు. ఇకపై వాళ్లకు ఆ భయం ఉండదు.. ఇయ్యాల మా పిల్లలు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెట్టు నీడలో చదువుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదువుకుంటారు’’

- పోఖారి గ్రామస్తులు దాదా ఖిల్లరే, పారుబాయ్ ఫాల్కే

సాయం చేస్తున్నం

‘‘తమ పిల్లల్ని ఆఫీసర్లుగా చూడాలని.. గ్రామస్తులు స్కూల్ నిర్మాణానికి పూనుకున్నారు. వాళ్లకు సాయం చేయాలని జిల్లా పరిషత్​ నిర్ణయించింది. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆట స్థలం, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు.. చుట్టుపక్కల పొలాల రక్షణ కోసం వాటర్ డ్రైన్ పనులను చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం’’

- బీడ్ జిల్లా పరిషత్​ అదనపు సీఈవో జ్ఞానోబా మొకాటె