ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని వినియోగించుకోండి : కలెక్టర్ జితేశ్

ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని వినియోగించుకోండి : కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ 

భద్రాచలం, వెలుగు : ఈనెల 29న భద్రాచలంలో, 30న దుమ్ముగూడెంలో నిర్వహించే ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్ సూచించారు. దీనికి సంబంధించిన వాల్​పోస్టర్​ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ, మారుతీ నర్సింగ్​ కాలేజీ, లయన్స్ క్లబ్​, వికాస తరంగిణీ, ఎస్​ఆర్​ఏఐ వాసవీ అసోషియేషన్​(యూఎస్​ఏ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాలను గిరిజనులు ఉపయోగించుకోవాలని కోరారు.

క్యాన్సర్​ వ్యాధి చికిత్సలో నిపుణులైన ఎంఎన్​జే క్యాన్సర్​ ఆసుపత్రి డాక్టర్లు, భద్రాచలంకు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్​జయభారతి, సర్జికల్​ అంకాలజిస్టు డాక్టర్​ ఎం.మధుమోహన్​రెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. పరీక్షలు చేసి ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తారని వివరించారు.