క్యాప్​జెమినీలో 60 వేల జాబ్స్​

క్యాప్​జెమినీలో 60 వేల జాబ్స్​

పుణె: ఫ్రెంచ్ టెక్నాలజీ సంస్థ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌ జెమినీ ఈ ఏడాది ఇండియా ఆఫీసుల కోసం దాదాపు 60 వేల మందిని నియమించుకోనుంది. 2021లో ఇచ్చిన జాబ్స్​ కంటే ఇవి చాలా ఎక్కువని,  డిజిటల్ ఆధారిత పరిష్కారాల కోసం  ఈ నియామకాలు సాయపడతాయని కంపెనీ సీఈఓ అశ్విన్ యార్డి తెలిపారు.  ఫ్రెషర్లతోపాటు సీనియర్లకూ అవకాశాలు ఇస్తామని చెప్పారు. తమకు  ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ఇండియా నుంచే సగం మంది ఉంటారని అన్నారు. 5జీ, క్వాంటం వంటి టెక్నాలజీలపై మరింత ఫోకస్​ చేస్తామన్నారు. స్వీడన్​కు చెందిన ఎరిక్సన్​తో కలసి క్యాప్‌‌‌‌జెమినీ గత ఏడాది భారతదేశంలో 5జీ ల్యాబ్‌‌‌‌ను ప్రారంభించింది.  5జీ టెక్నాలజీ డెవెలప్​మెంట్​కోసం గ్లోబల్, ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తున్నామని తెలియజేసింది.