ఆమనగల్లు, వెలుగు : ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర అభివృద్ధికి ఉజ్వల భవిష్యత్ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కడ్తాల్‌లో ఆయన మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయమని, ఇది రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతుందని పేర్కొన్నారు. అంతకుముందు తలకొండపల్లి మండలం ఖానాపూర్ లో నిర్వహించిన చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
