G20 అతిథులకు వెండి, బంగారు పాత్రలలో భోజనం

G20 అతిథులకు వెండి, బంగారు పాత్రలలో భోజనం

సెప్టెంబర్ 8-నుంచి 10 వరకు జరగనున్న G20 సమ్మిట్‌కు ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు దేశ రాజధాని అంతా ముస్తాబైంది. ఈ సమ్మిట్ కు రాజకీయ, సాంస్కృతిక , వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. వీరికోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. సమావేశాల్లో పాల్గొనే అతిథులకు భారత్ గొప్ప విందు భోజనాలు అందించబోతోంది. 

Also Read :- ఆ మూడు రోజులు ఢిల్లీ మొత్తం బంద్ : స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు అన్నీ..

జి20 అతిథులకు అరుదైన గౌరవం దక్కనుంది. దేశ విదేశాలనుంచి వచ్చే అతిథులకోసం బంగారు, వెండి పేట్లలో భోజనం వడ్డించనున్నారు. G20 అతిథులకు జైపూర్‌కు చెందిన IRIS సిల్వర్‌వేర్‌లో తయారు  చేసిన వెండి, బంగారం పాత్రలలో ఆహారాన్ని అందిస్తారు. జీ20 లీడర్స్ సమ్మిట్ కోసం లీలా ప్యాలెస్ హోటల్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. హోటల్ సిబ్బంది, వంటల బృందం, ప్రతినిధుల కోసం అద్భుతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.