టీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న గద్దర్

టీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న గద్దర్

మేడ్చల్ జిల్లాలో టీఆర్‌‌ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. అల్వాల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ నిరసన చేపట్టారు. కేంద్రమే వడ్లన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు ఆధ్వర్యంలో ధర్నాను చేశారు. రైతుల కోసమే తాను ఈ ధర్నాలో పాల్గొన్నానని గద్దర్ తెలిపారు. రైతుల పండించిన వడ్లను మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

మిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే