
హైదరాబాద్: తెలుగు సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రదానం చేయనుంది. గద్దర్ అవార్డులకు ఎంపికైన సినిమాలను, సినీ నటులను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 14న ఈ అవార్డుల ప్రదాన వేడుక కన్నుల పండుగగా జరగనుంది.
కవులు, కళాకారులు, సినిమావాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే శాసనమని, తన మాటే జీవో అని అప్పట్లో సీఎం చెప్పిన మాటను తాజాగా నిజం చేశారు. తెలంగాణ లెజెండ్, బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అని, ఆయన పేరుపై అవార్డులను ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం విదితమే.
గద్దర్ అవార్డుల ప్రకటన
- 2024- ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి
- 2024 రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్
- ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్
- ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప-2)
- బెస్ట్ డైరెక్టర్-నాగ్ అశ్విన్ (కల్కి)
- బెస్ట్ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- బెస్ట్ కొరియోగ్రాఫర్-గణేశ్ ఆచార్య (దేవర)
- స్పెషల్ జ్యూరీ అవార్డ్-దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-ఎస్ జె సూర్య (సరిపోదా శనివారం)
- బెస్ట్ స్టోరీ రైటర్ (శివ పాలడుగు) (మ్యూజిక్ షాప్ మూర్తి)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
- ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
- ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్‌రెడ్డి (గామి)
- ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2 చూసేకి)