మక్కజొన్న కొనుగోళ్లు కంప్లీట్ చేయాలి : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

మక్కజొన్న కొనుగోళ్లు కంప్లీట్ చేయాలి : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
  • గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు: జిల్లాలో మక్కజొన్న కొనుగోళ్లు ఇప్పటికే 70 శాతం కంప్లీట్ అయ్యాయని, మిగిలిన మొక్కజొన్నలను వచ్చే మూడు రోజుల్లో కొనుగోళ్లను కంప్లీట్ చేయాలని  జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆఫీసర్లను ఆదేశించారు. 

గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షాలకు తడిసిపోకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన మక్కజొన్నను ముందుగా తూకం వేయాలన్నారు.