
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్, కారు చేజింగ్‍లతో తో వచ్చిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.
పర్యావరణ,వాతావరణ మార్పుల శాఖ మంత్రి పాత్రను నాజర్ పోషించినట్లు తెలుస్తోంది. ఇక నాజర్ చెప్పే డైలాగ్‍తో గాండీవధారి అర్జున ట్రైలర్ స్టార్ట్ అవుతూ..డిసెంబర్ 2020లో దేవుడి మీద మనిషి గెలిచాడంట. జస్ట్ పాతిక వేల సంవత్సరాల్లో మనిషి చేసిన వస్తువులు దేవుడు చేసిన వాటిని మించేశాయంట..ఎలాగో తెలుసా..అంటూ ఇంటెన్స్ కలిగించేశారు డైరెక్టర్. ఆ తర్వాత క్రమంలోనే..దేశ రక్షణ విషయంలో ఓ పెద్ద సమస్య తలెత్తడం..ఏజెన్సీలో ఇంకెవరు లేరా?.. అనగానే..ఏజెన్సీలో చాలా మంది ఉన్నారు. కానీ క్లైంట్ కోసం బులెట్ తీసుకునే వారు అర్జున్ ఒక్కడే.. అన్నప్పుడు వరుణ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత క్లైంట్ అయినా సరే, తప్పు చేస్తే చంపేస్తా..అంటూ వరుణ్ అనడం అంత స్పీడ్ స్పీడ్‌గా సాగిపోయింది.
అలాగే ఈ మిషన్ లో ఫైనల్‌గా 12 వేల మంది చనిపోయారంటూ..దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్యను అర్జున్ ఎలా పరిష్కరించాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటి? ఇంతకీ అతడు చేపట్టిన ఆపరేషన్ వెనకున్న లక్ష్యమేమిటి? అనేది ట్రైలర్ ఆద్యంతం చూపించారు.
భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో.. అని నాజర్ చెప్పే డైలాగ్ మూవీకే హైలెట్ గా నిలిచేలా ఉంది. కాగా ట్రైలర్‌లోని అంశాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్ లో ఒక్కో సీన్స్ అండ్ ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టుగా మిక్కీ జే మేయర్(Micky j mayer) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ ఉంది.
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రియేటివ్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గాండీవధారి అర్జున చిత్రం ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్, మనీశ్ చౌదరీ, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబి వేద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్(SVCC) పై బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. సాక్షి వైద్య(Sakshi vaidya) హీరోయిన్ గా నటిస్తోంది. గని సినిమాతో వరుణ్, ఘోస్ట్ సినిమాతో ప్రవీణ్ సత్తారు.. ఫ్లాప్స్ తో ఉన్నారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా చాలా స్పెషల్. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు దర్శకుడు, హీరో. మరి ఈ సినిమా ఈ ఇద్దరికీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి మరి.