లాల్‌బాగ్చా రాజా మొదటి దర్శనం టైం, డేట్ రివీల్.. లైవ్ దర్శనం కూడా

లాల్‌బాగ్చా రాజా మొదటి దర్శనం టైం, డేట్ రివీల్.. లైవ్ దర్శనం కూడా

ముంబయిలో అంగరంగ వైభవంగా నిర్వహించే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్కడ లాల్‌బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ్ నిర్వహించే వేడుకల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏటా అత్యంత ఆర్భాటంగా నిర్వహించే ఈ ఉత్సవాలు ఈ సారి కూడా ఘనంగా నిర్వహించేందుకు నిర్వహకులు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో గణపతి మొదటి దర్శనానికి సంబంధించిన తేదీ, సమయం వివరాలను వెల్లడించారు. దాంతో పాటు పండల్ నుంచి ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్ లింక్ ను కూడా పంచుకున్నారు.

లాల్‌బాగ్చా రాజా మొదటి దర్శనం సెప్టెంబర్ 15, శుక్రవారం జరుగుతుంది. బప్పా తన మనోహరమైన రూపాన్ని భక్తులకు సాయంత్రం ఏడు గంటలకు దర్శనమివ్వనున్నారు. ఈ ప్రత్యేక ఈవెంట్‌లో నియంత్రిత ఎంట్రీలు ఉన్నాయి. భక్తులు యూట్యూబ్ (YouTube)లో ప్రత్యక్షంగానూ చూడవచ్చు.

Also Read :- మహా శక్తిని ఇచ్చే ఐదు వినాయకుడి అవతారాలు

సెప్టెంబర్ 15న గణపతి మూర్తి తొలి దర్శనమివ్వనున్నారని లాల్‌బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ్ మండల అధ్యక్షుడు బాలాసాహెబ్ కాంబ్లే తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు దర్శనం కోసం తెరిచి ఉంటుందని చెప్పారు.