రైతుల కోసమే ప్రభుత్వం కృషి

రైతుల కోసమే ప్రభుత్వం కృషి

రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ అని  అన్నారు  మంత్రి గంగుల కమలాకర్. రైతుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని గోపాలపూర్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.  కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది ఏర్పడినా.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని తెలిపారు గంగుల. కళ్యాణలక్ష్మీ, ఆసరా ఫించన్లు, ఉచిత కరెంటు, రైతుబందు వంటివి నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది వడ్లు వేసేవాళ్లకు రైతుబంధు రాదనే తప్పుడు  ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గతంలో మాదిరిగానే ప్రతీ ఒక్కరికీ రైతు బంధుని అందజేస్తుందన్నారు,

మరోవైపు ..ఈ యాసంగిలో రైతులు ఇష్టమైన పంట వేసుకోవడానికి అనుమతి ఉందని తెలిపారు మంత్రి గంగుల. అయితే యాసంగిలో కేంద్రం వరి వేయొద్దని, కొనమని చెప్పడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. మిల్లర్లతో..అగ్రిమెంట్లు  ఉన్నవాళ్లు సొంత ఏర్పాట్లతో వేసుకోవాలని సూచించారు.

 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ఫాం హౌజ్ లో వరి సాగుపై రచ్చ