జగిత్యాలలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇల్లు ధ్వంసం,ముగ్గురికి గాయాలు

జగిత్యాలలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇల్లు ధ్వంసం,ముగ్గురికి గాయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో  ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.  పెద్ద శబ్దంతో పేలుడు సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇల్లు స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి గాయాలయ్యాయి. సమాచారం  అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. గాయపడిన వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. వివరాల్లోకి వెళితే.. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం భారీ శబ్ధంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో ఉన్న రౌతు నరేందర్(42), భారతపు సుమలత(39), సహస్ర(12) లకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు కాళ్లు, చేతులు, మేడకు  కాలిన గాయాలయ్యాయి. వారిని వెంటనే  స్థానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువుల, గోడలు ధ్వంసమయ్యాయి.  స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు.