ప్రపంచానికి వార్నింగ్.. గ్లోబల్ వార్మింగ్

ప్రపంచానికి వార్నింగ్.. గ్లోబల్ వార్మింగ్

భూమి ఉపరితల ఉష్ణోగ్రతల్లో సంభవించే అసాధారణ, అవాంఛనీయ పెరుగుదలను గ్లోబల్ వార్మింగ్(భూతాపం) అంటారు. సాధారణంగా భూమి పైకి చేరిన సౌరపుటం తిరిగి పరావర్తనం చెందుతుంది. ఈ పరావర్తనాన్నే ‘ఆల్బిడో’ అంటారు. భూమిపైకి చేరిన సౌరపుటం పూర్తిగా పరావర్తనం చెందితే భూమిపై ఉన్న నీరంతా గడ్డకట్టు తుంది. అదే విధంగా భూమి పైకి చేరుతున్న సౌర వికిరణాన్ని భూమిపై ఉన్న ఘన, ద్రవ,వాయు పదార్థాలు పూర్తిగా గ్రహిస్తే భూమి వేడెక్కి మండే గ్రహంగా మారుతుంది. ఈ రెండు జరగకపోవడానికి కారణం భూమి కింది వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ భూమి పైకి చేరి పరావర్తనం చెందుతున్న కొద్ది సౌరవికిరణాన్ని కార్బన్‌‌ డై ఆక్సైడ్ అడ్డుకుంటుం ది. ఫలితంగా భూ ఉపరితల ఉష్ణో గ్రతలు పెరుగుతాయి. కార్బన్ డై ఆక్సైడ్ ద్వారా కలిగే ఈ దుష్ఫరిణామాన్నే ‘గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్’ అని పేర్కొంటారు.

కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌజ్ తెర వలే వ్యవహరిస్తున్నం దున దీనిని గ్రీన్ హౌజ్ వాయువు లేదా ‘హీట్ ట్రాపింగ్ గ్యాస్’ అని పిలుస్తారు. భూమిని గ్రీన్‌‌హౌజ్‌‌తో పోల్చినప్పుడు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ దాని తెరలా పనిచేసి పరావర్తనం చెందుతున్న సౌర వికిరణాన్ని అడ్డుకుని భూతాపానికి కారణమవుతుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగే కొద్ది ఉపరితల ఉష్ణో గ్రతలు పెరిగి భూతాపం సంభవిస్తుంది.

పారిశ్రామికీకరణ ఫలితంగా శిలాజ ఇంధనాల వినియోగం పెరిగి అతి తక్కువ కాలంలోనే కార్బన్ డై ఆక్సైడ్ విపరీత స్థా యికి చేరింది. 1750లో 280పార్ట్ పర్ మిలియన్(పీపీఎం) గా ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ విలువ 2012 నాటికి 400 పీపీఎం దాటిం ది. అతి తక్కు వ కాలంలో జరిగిన ఈ పరిణామం వలన భూమి ఉపరితల ఉష్ణో గ్రతలు అనూహ్యంగా పెరిగి భూతాపం సంభవించింది. ప్రారంభంలో భూతాపానికి కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే కారణంగా భావించారు. అనంతర కాలంలో మరిన్ని గ్రీన్‌‌హౌజ్ వాయువులు భూతాపానికి కారణమవుతున్నట్లు కనుగొన్నారు.

ప్రభావాలు

1 సముద్రమట్టం పెరగడం: శీతోష్ణస్థితి మార్పు ద్వారా ధ్రువ ప్రాంతాలలోని మంచు కరిగి సముద్రమట్టం పెరుగుతుంది. ఐపీసీసీ ప్రకారం 2100 సంవత్సరం నాటికి సముద్రమట్టం 80 సెంటీమీటర్లకి పైగా పెరిగే ప్రమాదం ఉంది. దీం తో ఫసిఫిక్, హిందూ మహాసముద్రాలలోని అనేక దీవులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

2 పంట దిగుబడి తగ్గుదల: గ్లో బల్ వార్మింగ్‌‌తో నైరుతి, ఈశాన్య రుతుపవనాలపై ప్రభావం పడుతుంది. ఆలస్యం గా వర్షం కురవడం, కుండపోతగా వర్షం కురిసి పంటలు నాశనం కావడం లాం టి ప్రభావాలు కలుగుతాయి. లవణసాం ద్రత పెరిగినప్పుడు నేల లవణీయత పెరిగి పంటల దిగుబడి తగ్గుతుంది.

3 ఓషన్ అసిడిఫికేషన్: వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగే కొద్ది సముద్రపు నీటిలో కరిగే కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు పెరుగుతుంది. సముద్ర నీటిలో కార్బోని కామ్లం పెరిగి నీరు ఆమ్లయుతంగా మారడాన్ని ‘ఓషన్ అసిడిఫికేషన్’ అంటారు. దీంతో జీవవైవిధ్యాని కి నిలయంగా ఉన్న ప్రవాళ అవరోధాలు క్రమక్షయానికి గురవుతాయి.

4 జీవ వైవిధ్య నష్టం : భూమి ఉపరితల ఉష్ణో గ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే కొద్ది 20 నుంచి 30శాతం జీవవైవిధ్యం నష్టపోనున్నట్లు ఐపీసీసీ గుర్తించింది. భూతాపం పెరిగితే సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతాలు ముం పునకు గురై ఆయా ప్రాంతాలలోని స్థా నీయ వైవిధ్యం శాశ్వతంగా అదృశ్యమవుతుంది.

తీసుకున్న చర్యలు

పర్యావరణంపై మానవ చర్యల వలన ఏర్పడుతున్న ప్రభావాలను నియంత్రించాలన్న లక్ష్యం తో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి 1972లో స్టాక్‌‌హోంలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్ ఎన్విరాన్‌‌మెంట్(యూఎన్‌‌సీహెచ్‌ఈ) పేరుతో ఒక సదస్సును నిర్వహించింది. భూతాపం ద్వారా సంభవిస్తున్న పర్యావరణ మార్పుపై అధ్యయనం కోసం 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌‌ఈపీ), వరల్డ్ మెటిరిలాజికల్ ఆర్గనైజేషన్(డబ్ల్ యూఎంవో) సంయుక్తంగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(ఐ-పీసీసీ) అనే సంఘాన్ని నియమించింది. దీని మొదటి నివేదిక 1990లో విడుదలైంది. మానవజనిత కారణాల ద్వారానే ప్రస్తుత భూతాపం, పర్యావరణ మార్పులు సంభవిస్తున్నా యని ఈ నివేదికలో పేర్కొం ది.

అంతర్జాతీయ స్థాయిలో భూతాపాన్ని నివారించే ఒక ఒప్పందం అవసరమని ఐరాస గుర్తించి 1992లో బ్రెజిల్‌‌లోని రియోడీజనిరోలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌‌మెంట్ అండ్ డెవలప్‌ మెంట్ అనే సదస్సును నిర్వహించింది.దీనినే ‘రియో సదస్సు’ లేదా ‘ధరిత్రి సదస్సు’అంటారు. ఈ సదస్సులో ప్రవేశపెట్టిన ఒప్పం దాలలో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(యూఎన్‌‌ఎఫ్‌ సీసీ) ఒప్పం దం ప్రధానమైనది.సభ్యదేశాలన్నీ మనిషి, ఇతర జీవులపై ప్రభావాన్ని చూపని స్థా యికి గ్రీన్ హౌజ్ ఉద్గా రాల తగ్గిం పునకు కృషి చేయాలని తీర్మానిం చాయి.

యూఎన్‌‌ఎఫ్‌ సీసీపై సంతకాలు చేసిన దేశాలన్నీ 1995 మొదలుకుని ప్రతి ఏటా సమావేశాలు నిర్వహిం చేవి. ఈ సదస్సులను ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(సీవోపీ) అంటారు.మొదటి సదస్సు 1995లో కాప్‌ –1 బెర్లిన్‌‌లో జరిగిం ది. 1997లో క్యోటో నగరంలో జరిగిన కాప్–3 సదస్సులో క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పం దాన్ని తీసుకొచ్చారు. ఈ ఒప్పం దం ప్రకారం సభ్యదేశాలు గ్రీన్‌‌హౌజ్ ఉద్గా రాలను 1990 నాటి ఉద్గా రాల స్థా యిలో కనీసం 5శాతం మేరకు తగ్గిం చాలనేది ఈ ఒప్పం దం లక్ష్యంగా పెట్టు కుంది.

గ్రీన్‌‌హౌజ్ ఉద్గా రాలను అధికంగా విడుదల చేసే దేశాలలో అమెరికా ఉన్నప్పటికీ ఈ ఒప్పం దం నుంచి వైదొలిగిం ది. యూరోపియన్ యూనియన్, రష్యా, జపాన్,ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రధానంగా ఈ ఒప్పం దాన్ని అమలు చేశాయి. 2005 ఫిబ్రవరి 16న ఈ ఒప్పం దం అమల్లో కి వచ్చి 2012 డిసెంబర్ 31వరకు కొనసాగింది.భారత్, చైనా వంటి అభివృద్ధి దేశాలకి ఈ ఒప్పం దంలో మినహాయింపు లభించింది.

2011లో జరిగిన కాప్–17లో డర్బన్ ప్లాట్‌‌ఫాం పేరుతో ఒక కొత్త నిర్ణయాన్ని సభ్యదేశాలన్నీ తీసుకున్నా యి. దీని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఉద్గారాల తగ్గిం పునకు కట్టు బడి ఉండేలా ఒక కొత్త ఒప్పం దాన్ని 2015 నాటికి ప్రకటించి 2020 నాటికి అమల్లో కి తీసుకు రావాలి .ఇందుకు భారత్ సైతం ఆమోదం తెలిపింది.

2012లో ఖతర్‌‌‌‌లోని దోహాలో జరిగిన కాప్–18లోనూ ఇవే చర్చలు జరిగాయి. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు శీతోష్ణస్థి తి మార్పు సవాళ్లని సమర్థవంతంగా ఎదుర్కొనేం దుకు అభివృద్ధి చెందిన దేశాలు 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఒప్పుకున్నాయి.

కాప్–21 సదస్సు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వరకు జరిగిం ది. ఈ సదస్సులో సభ్యదేశాలన్నీ పారిస్ ఒప్పం దం పేరుతో ఒక ఒప్పం దాన్ని  కుదుర్చుకున్నా యి.

యూఎన్‌‌ఎఫ్‌ సీసీపై సంతకాలు చేసిన సభ్యదేశాల కాప్–22 సమావేశం 2016లో మొరాకోలోని మర్రకేష్ నగరంలో జరిగింది.

కాప్–24

యూఎన్‌‌ఎఫ్‌ సీసీ అంతర్జా తీయ భాగస్వామ్య దేశాల 24వ సమావేశం(కాప్–24) పోలండ్‌‌లోని క్యాటోవిస్‌‌ నగరంలో 2018 డిసెంబర్‌‌‌‌లో జరిగిం ది. కఠినమైన లక్ష్యాల ద్వారా అధిక పారదర్శకతతో కూడిన ఉద్గారాల తగ్గిం పునకు సభ్యదేశాలన్నీ కృషి చేయాలని కాప్–24 సమావేశంలో అంగీకరిం చారు. పారిస్ ఒప్పం దం నుంచి వైదొలుగుతామని 2017లో అమెరికా ప్రకటించి న నేపథ్యంలో , ఇతర దేశాలు అదే బాటపడితే ఒప్పం దం నీరుగారే ప్రమాదం ఉంటుం దని సదస్సులో పేద, అభివృద్ధి చెందిన దేశాలు హెచ్చరిం చాయి. కాప్–25వ సమావేశం ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 13 వరకు చిలీలోని శాం టియాగోలో నిర్వహించనున్నారు. ఈ సమావేశం బ్రెజిల్‌‌లో జరగాల్సి ఉండగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చిలీలోని శాం టియాగోకు గంగా భాస్కర్ మార్చారు.

పారిస్ ఒప్పందం

పారిశ్రామికీకరణకు ముం దున్న ఉపరితల ఉష్ణో గ్రతల కంటే 2100 నాటికి 2 డిగ్రీలకు పైగా ఉష్ణో గ్రతలు పెరగకుండా అడ్డుకోవాలి . వీలైతే ఈ పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌‌కు పరిమితం చేయాలి. గ్రీన్‌‌హౌజ్ ఉద్గా రాల విడుదలకు కారణం కానీ సాం కేతికతను అభివృద్ధి చేసుకోవడం, వ్యవసాయ దిగుబడి ఏ మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకోవాలి . అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ తమ అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే ఉద్గా రాల తగ్గిం పునకు కృషి చేయాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యదేశాలన్నీ తమ ఉద్గా రాల లక్ష్యాలను తెలియజేయాలి. 2020 నాటికి 100 బిలియన్ డాలర్ల గ్రీన్ క్లైమేట్ ఫండ్‌‌ను అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటు చేయాలి. శీతోష్ణస్థి తి మార్పునకు గురవుతున్న అనేక పేద దేశాలకు ఆర్థికసాయాన్ని అందించే విధంగా ఈ ఫండ్‌‌ని ఉపయోగించాలి. 2030 నాటి భారత్ 2005లోని తమ ఉద్గా రాలలో 33 నుంచి 35శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.

global warming effects and action plans to control it