IRCTC గోవా టూర్.. హైదరాబాద్ నుంచి తక్కువ ధరకే ఫ్లైట్ ప్యాకేజీ

IRCTC గోవా టూర్.. హైదరాబాద్ నుంచి తక్కువ ధరకే ఫ్లైట్ ప్యాకేజీ

ప్రతి ఒక్కరూ గోవాను సందర్శించాలని..గోవాలో ఎంజాయ్ చేయాలని కలలు కంటారు. అయితే పరిస్థితిలు, డబ్బులు అడ్జెస్ట్ కాక..చాలా మంది గోవా టూర్ ను క్యాన్సల్ చేసుకుంటారు. మరికొందరు తర్వాత వెళ్దాం..తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేసుకుంటారు. అయితే తక్కువ బడ్జెట్ లో గోవాకు విమానంలో వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వే సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలో విమానంలో గోవా వెళ్లిరావచ్చు. IRCTC గోవా టూర్ ప్యాకేజీని ఒక్కసారి పరిశీలిద్దాం..

గోవాలోని అందమైన బీచ్‌లను చూసే గొప్ప అవకాశం 

IRCTC గోవా రిట్రీట్ పేరుతో ఓ టూర్ ప్యాకేజీని రూపొందించింది.  ఈ పర్యటనలో  పర్యాటకులు దక్షిణ గోవా , ఉత్తర గోవాలోని అద్భుతమైన, అందమైన  ప్రదేశాలు, బీచ్‌లను సందర్శించొచ్చు. 

విమాన ప్రయాణం..తక్కువ ఖర్చులో..

గోవా రిట్రీట్ పేరుతో IRCTC అందిస్తున్న టూర్ ప్యాకేజీలో  3 రాత్రులు/4 రోజులు ఉండొచ్చు. నవంబర్ 2, నవంబర్‌ 30వ తేదీల్లో ఈ టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా టూరిస్టులు  మొదటి రోజు హైదరాబాద్‌లో  మధ్యాహ్నం 12.50 గంటలకు విమానం ఎక్కుతారు. మధ్యాహ్నం 2 గంటలకు గోవాలో దిగుతారు.  హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత జువారీ రివర్ సందర్శిస్తారు.  రాత్రికి గోవాలో బస చేయాలి

రెండో రోజు సౌత్ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ ను సందర్శించొచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మండోవి నదిపై బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి హోటల్‌లో బస చేయాలి. 

మూడో రోజు నార్త్ గోవా టూర్ లో భాగంగా  ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్ ను  చూడొచ్చు. సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ చూడొచ్చు. నాలుగో రోజు ఉదయం మధ్యాహ్నం 2.30 గంటలకు గోవాలో విమానం ఎక్కాల్సి ఉంటుంది.  మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.  మీ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించొచ్చు.

ఒక్కొక్కరికి ఇంతే..

ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ ధరలో ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,805 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,930, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.27,560 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో  విమానం టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.