గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం

గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం

పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌ (48) ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి సీఎంగా ఆయన ఈ పదవిని చేపట్టారు. గోవాకు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడో వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డ్ సృష్టించారు. అంతకు ముందు 2019లో ఆయన మొదటిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు సీఎంగా ఉన్న మనోహర్ పారికర్ కన్నుమూయడంతో ఆయన స్థానంలో ప్రమోద్ సావంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.  ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని మళ్లీ రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు.

రాజ్ భవన్ బయట డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై ప్రమోద్ సావంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.  
ఇదిలా ఉండగా.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు గల గోవా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని బీజేపీ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఒక్క సీటు మాత్రమే  తక్కువపడగా ఎంజీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్ధతు పలికారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజీపీకి మార్గం సుగమమైంది.

 

 

ఇవి కూడా చదవండి

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

దేశంలో భగ్గుమంటున్న చమురు ధరలు

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది

అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో