
నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆలయ పురవీధులను తాకింది వరద. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. నదితీరంలో ఉన్న అమ్మవారి విగ్రహన్ని తాకి ప్రవహిస్తోంది వరద. ఆలయానికి వెళ్లే రహదారి పూర్తిగా జలమయం అయ్యింది.
మూడు లాడ్జీలు, ఒక గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగాయి. దర్శనానికి వచ్చిన తొమ్మిది కుటుంబాలు అందులో చిక్కుకుపోయాయి. భవనం పైకి ఎక్కి అందులోనే ఉండిపోయారు. స్థానికులు, పోలీసులు వారికి ఆహారాన్ని అందించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరో వైపు వరద ఉదృతిని సందర్శించిన ఎస్పీ జానకి..పరిస్థితులపై ఆరాదీశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. యాత్రికులను స్నాన ఘట్టాల వైపు వెళ్తొద్దని సూచించారు.
గత మూడు రోజులుగా మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనం అస్తవ్యవస్థమయ్యింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి.ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వాతావరణ శాఖ మూడు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను కొనసాగిస్తోంది.
►ALSO READ | పోటెత్తిన వరద.. జలదిగ్భంధంలో ఏడుపాయల టెంపుల్