Gold Rates : నెల రోజుల్లో రూ. 2 వేలు తగ్గిన బంగారం.. ఇప్పుడెంతంటే

Gold Rates :  నెల రోజుల్లో రూ. 2 వేలు తగ్గిన బంగారం.. ఇప్పుడెంతంటే

దేశవ్యాప్తంగా  నెల రోజుల్లో బంగారం ధర రూ.  2 వేలు తగ్గింది.  2023 సెప్టెంబర్ రెండోవారంలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  54  వేల500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  59 వేల 450 గాఉంది. ప్రస్తుతం మార్కెట్ లో   2023 అక్టోబర్ 07   శనివారం   రోజున  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 52 వేల 750కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  ధర రూ. 310 పెరిగి రూ. 57  వేల 540కు చేరుకుంది.  దేశవ్యాప్తంగా  బంగారం ధరలు  ఎలా ఉన్నాయో చుద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 900ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 690 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 540 గా ఉంది.

హైదరాబాద్ లో   22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 540 గా ఉంది.  విజయవాడలో  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 540గా ఉంది.  

మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.  ప్రస్తుతం మార్కెట్ లో పది గ్రామల వెండి రూ. 730గా ఉండగా, కేజీ వెండి రూ.  73 వేలుగా  పలుకుతోంది.