పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు భారీగా తగ్గాయి. గతకొన్ని రోజులుగా సామాన్యులకు.. బంగారం ధరలు అందని ద్రాక్షగా మారాయి. చూస్తుండగానే తులం బంగారం ధర రూ.70 వేలు దాటింది. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనాలంటనే భయపడే పరిస్థితి నెలకొంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 700 తగ్గగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 760 తగ్గింది.  దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,500 ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,550గా ఉంది. 

ఇక, దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,500గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 72,550గా ఉంది. 

బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి.  ఈ రోజు  రూ. 1000 తగ్గింది. దీంతో  హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో కేజీ వెండి రూ. 89వేలుగా ఉండగా... ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాలో రూ.  85,500గా ఉంది.