భారీగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు..

భారీగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 450 తగ్గి రూ. 54,100 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 54,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర కూడా రూ. 490 తగ్గింది. ప్రస్తుతం ఈ రేటు రూ. 59,020 గా ఉంది. బుధవారం ఈ ధర రూ. 59,510 గా ఉంది. 
హైదరాబాద్లో..
హైదరాబాద్​లో గురువారం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,020గా నమోదైంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,250గాను 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,170గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​59,020 గా ఉంది.  ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
వెండి స్థిరంగా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఈ ధర రూ. 73,000గా ఉంది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. రూ. 76,200 గా కొనసాగుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​73,000 బెంగళూరులో రూ.72,000గా ఉంది.