స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధర కూడా..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధర కూడా..

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ.100 తగ్గి, రూ. రూ. 55,050 కి చేరింది. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 100 తగ్గి రూ. 60,060 కి చేరింది. క్రితం రోజు ఇది రూ. 60,160 గా ఉంది. 

దేశవ్యాప్తంగా  ప్రధాన నగరాల్లో బంగారు ధరలు 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,200గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,050 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​60,060గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,060గా నమోదైంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,400గాను..24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,050గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,060గాను ఉంది. అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,120గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,050గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,060గా ఉంది.
తగ్గిన వెండి ధర..
దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,400గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.74,000కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 75,000గా ఉంది.  హైదరాబాద్​లో కేజీ వెండి ధర బుధవారం కేజీకి సుమారు రూ.1000 తగ్గింది. బుధవారం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.77,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.74,000.. బెంగళూరులో రూ.73,000గా ఉంది.