
Gold Price Today: ప్రస్తుతం గోల్డ్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లతో పాటు సెంట్రల్ బ్యాంకుల నుంచి ఎక్కువ డిమాండ్ చూడటం వల్లనే పెరుగుదలను చూస్తోందని గోల్డ్ మాన్‌శాక్స్ పేర్కొంది. అయితే భారీగా ధరల్లో హెచ్చుతగ్గులలు ఉన్నప్పటికీ ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరుకుంటోంది. మార్చి నెల నుంచి పసిడి కొనుగోళ్లను రిటైలర్లు పెంచటంతో దీని ధర ముందుకు నడిపించబడుతోంది. అలాగే ఇక సెంట్రల్ బ్యాంకుల నుంచి డిమాండ్ తారా స్థాయిలకు చేరుకుంటోంది. అందుకే పసిడి ధరలు నిరంతరం పెరుగుదలను చూస్తూన్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాముల గోల్డ్ రేటు రూ.4వేల 500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ గ్రాము విక్రయ ధరను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8వేల 995, ముంబైలో రూ.8వేల 995, దిల్లీలో రూ.9వేల010, కలకత్తాలో రూ.8వేల 995, బెంగళూరులో రూ.8వేల 995, కేరళలో రూ.8వేల 995, పూణేలో రూ.8వేల 995, వడోదరలో రూ.9వేలు, అహ్మదాబాదులో రూ.9వేలు, జైపూరులో రూ.8వేల 964, లక్నోలో రూ.8వేల 964, మంగళూరులో రూ.8వేల 995, నాశిక్ లో రూ.8వేల 998, అయోధ్యలో రూ.9వేల 010, బళ్లారిలో రూ.8వేల 995, గురుగ్రాములో రూ.9వేల 010, నోయిడాలో రూ.9వేల 010 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 900 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లు గ్రాముకు చూస్తే.. చెన్నైలో రూ.9వేల 813, ముంబైలో రూ.9వేల 813, దిల్లీలో రూ.9వేల 828, కలకత్తాలో రూ.9వేల 813, బెంగళూరులో రూ.9వేల 813, కేరళలో రూ.9వేల 813, పూణేలో రూ.9వేల 813, వడోదరలో రూ.9వేల 818, అహ్మదాబాదులో రూ.9వేల 818, జైపూరులో రూ.9వేల 778, లక్నోలో రూ.9వేల 778, మంగళూరులో రూ.9వేల 813, నాశిక్ లో రూ.9వేల 816, అయోధ్యలో రూ.9వేల 828, బళ్లారిలో రూ.9వేల 813, గురుగ్రాములో రూ.9వేల 828, నోయిడాలో రూ.9వేల 828గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 950 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 130గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 11వేల వద్ద ఉంది.