చెన్నై ఎయిర్ పోర్ట్ లో దొంగ బంగారం పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్ట్ లో దొంగ బంగారం పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారం అక్రమ రవాణా అవుతుందన్న ఇంటలీజెన్స్ సమాచారంలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. చెన్నైకు చెందిన మహ్మద్ యూసూఫ్(29) అనే వ్యక్తి  మలేషియానుంచి చెన్నైకి చేరుకున్నారు. అయితే అనుమానాస్పదంగా వ్యవహరించిన అతన్ని కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. దీంతో.. అతని వద్ద ఐదు రేడియోలు ఉండడంతో అనుమానం వచ్చి చెక్ చేశారు. ఆ రేడియోలలో 235గ్రాముల బంగారం దొరికింది. దాని విలువ తొమ్మిది లక్షల 26వేలని అధికారులు తెలిపారు.

మలేశియా కు చెందిన కమల్ (52) అనే వ్యక్తిని కూడా అధికారులు చెక్ చేయడంతో అతని లోదుస్తులలో 385 గ్రాముల బంగారం దొరికింది. దీని విలువ 15లక్షల 20 వేలు అని తెలిపారు అధికారులు.