Good Health : టీ (Tea) ఇలా తాగితే ఎంతో ఆరోగ్యం

Good Health : టీ (Tea) ఇలా తాగితే ఎంతో ఆరోగ్యం

పొయ్యి మీదికి టీ గిన్నె ఎక్కందే చాలా ఇండ్లలో పనులు ముందుకు కదలవు. తలనొప్పి వచ్చినా, ఎవరినైనా కలిసినా టీ తాగడం కామన్. అయితే, టీని ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఒక టైం ప్రకారం తాగాలి. దానివల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.

ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగొద్దు. బ్రేక్ఫాస్ట్ చేసిన 20 నిమిషాల తర్వాత టీ తాగితే ఆ రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే రోజులో ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా, రోజుకు రెండు నుంచి మూడుసార్లు మాత్రమే టీ తాగాలి.

• టీ తక్కువ తాగితే కార్డియోవాస్కులర్ జబ్బులు రావు. టైప్ -2 డయాబెటిస్, న్యూర లాజికల్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల క్యాన్సర్లు రావు. టీ మితంగా తాగితే డీ హైడ్రేషన్ కూడా జరగదు.